దినకరన్ పై కమలహాసన్ తీవ్ర ఆరోపణలు

  • ధనబలంతోనే గెలిచారు
  • అన్నాడీఎంకే కూడా ఓటర్లకు వెలకట్టింది
  • ఓటర్లు అమ్ముడుపోయారు
కేవలం ధనబలంతోనే ఆర్కేనగర్ ఉప ఎన్నికలో శశికళ మేనల్లుడు దినకరన్ గెలుపొందారని ప్రముఖ నటుడు కమలహాసన్ తీవ్ర ఆరోపణలు చేశారు. మన దేశ ప్రజాస్వామ్యానికి, తమిళనాడు రాజకీయాలకు ఆర్కేనగర్ ఉప ఎన్నికలు మాయని మచ్చగా మిగిలాయని విమర్శించారు. ఓటర్లను కొనుగోలు చేయడం ద్వారానే దినకరన్ గెలుపు సాధ్యమయిందని అన్నారు.

పాలకపక్షం అన్నాడీఎంకే కూడా ఓటర్లకు వెలకట్టిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తమిళ మేగజీన్ ఆనంద వికటన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కమల్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఓటర్లపై కూడా కమల్ విమర్శలు గుప్పించారు. మీరు అమ్ముడుపోయారంటూ వ్యాఖ్యానించారు. మరోవైపు కమల్ వ్యాఖ్యలను దినకరన్ ఖండించారు. తన గెలుపును జీర్ణించుకోలేకే కమల్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారని ఆయన అన్నారు.
Go Back to Shorts
Kamal Haasan
dinakaran
aiadmk

More Telugu News